హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో వందేభారత్ రైలు ప్రారంభమైంది. సికింద్రాబాద్-వైజాగ్ మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్సువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రారంభోత్సవంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా వందే భారత్ రైలు రావడం గొప్ప కానుక అని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణంతో పాటు సమయం కూడా తగ్గుతుందన్నారు. హైదరాబాద్ – వరంగల్ – విజయవాడ – విశాఖపట్నం నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుందన్నారు. 2023వ సంవత్సరంలో వందే భారత్ రైలు హైదరాబాద్‌లో ప్రారంభించామని మోడీ పేర్కొన్నారు. వందే భారత్ రైలు అత్యంత వేగంతో పాటు భద్రత, సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
"Vande Bharat Express between Secunderabad and Visakhapatnam will boost tourism, cut down travel time," PM @narendramodi #ITVideo #VandeBharatExpress #Visakhapatnam #Secunderabad pic.twitter.com/EbcrqD7VBj
— IndiaToday (@IndiaToday) January 15, 2023