Sunday, November 24, 2024

శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లు

- Advertisement -
- Advertisement -

అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే

మనతెలంగాణ/హైదరాబాద్:  శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నేటి నుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరువనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భక్తులు కేరళకు తరలివచ్చే అవకాశం ఉండడంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీ మేరకు వందే భారత్ రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను సైతం ప్రకటించింది. అయ్యప్ప భక్తుల కోసం చెన్నైటు తిరునల్వేలి మధ్య ప్రత్యేకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపనున్నట్లు పేర్కొంది. చెన్నై ఎగ్‌మోర్- టు తిరునల్వేలి (06067) ప్రత్యేక వందే భారత్ రైలు ఈ నెల 16, 23, 30 వ తేదీల్లో, డిసెంబర్ 7వ తేదీ, 14, 21, 28వ తేదీల్లో ఉదయం 6 గంటలకు చెన్నై ఎగ్మోర్ రైల్వేస్టేషన్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తిరునల్వేలి చేరుకుంటుందని, మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ బయలుదేరి రాత్రి 11.15 గంటలకు ఎగ్మోర్ స్టేషన్‌కు చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
ఎపి నుంచి కూడా ప్రత్యేక రైలు
ఈ రెండు మార్గాల్లో ప్రయాణించే ఈ రైలు తాంబరం, విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్, మధురై, విరుదునగర్ స్టేషన్‌లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. అలాగే శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఏపి నుంచి ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. తాంబరం- సంత్రాగచ్చి (06079) ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 22వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని, మధ్యాహ్నం ఒంటిగంటలకు తాంబరంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు సంత్రగాచి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
సంత్రాగచ్చి టు తాంబరం ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
అలాగే సంత్రాగచ్చి టు తాంబరం (06080) ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 16, 23వ తేదీల్లో రాత్రి 11.40 గంటలకు సంత్రగాచి నుంచి మూడోరోజు ఉదయం 9.35 గంటలకు తాంబరం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు చెన్నై ఎగ్మోర్, గూడురు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, పలాస, కుర్దా రోడ్డు, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్‌లలో ఆగుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాంబరం టు భువనశ్వేర్
తాంబరం టు భువనశ్వేర్ (06081) స్పెషల్ సూపర్‌ఫాస్ట్ రైలు ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు తాంబరంలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.55 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. భువనేశ్వర్ టు- తాంబరం (06082) రైలు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.50 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు తాంబరం చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయా రైళ్లలో వెయింటింగ్ లిస్ట్ భారీగా ఉండడంతో మరికొన్ని ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వేశాఖ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News