Monday, December 23, 2024

అధునాతన సదుపాయాలతో వందేభారత్ రైళ్లు : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకోవడం గొప్ప విషయం అని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం మరో తొమ్మిది రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటిని వర్చువల్ ప్రారంభించారు. ఇందులో కాచిగూడ- యశ్వంతపూర్. విజయవాడ-  చెన్నై మధ్య సర్వీసులందించే వందే భారత్ రైళ్లు కూడా ఉన్నాయి. కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. కాగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పలు నగరాల మధ్య ఈ తొమ్మిది రైళ్లు సర్వీసులందించనున్నాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ.. వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోందన్నారు.

రైల్వేల ఆధునికీకరణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. ‘పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యంత అనువైన ప్రయాణ సాధనం భారతీయ రైళ్లు. 140 కోట్ల మంది భారతీయుల ఆశలకు అనుగుణంగా వేగవంతమైన, భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వందే భారత్ రైళ్లకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. 111కోట్ల మంది ప్రయాణికులు ఇప్పటికే వీటిలో ప్రయాణించారు. ప్రస్తుతం 25 వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. మరో తొమ్మిది కొత్తగా చేరాయి. దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదు. సరికొత్త భారత్ విజయాలను చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. చంద్రయాన్ 3 విజయవంతంతో సామాన్యుడి అంచనాలు కూడా పెరిగాయి. మహిళల సారథ్యంలో పలు రంగాల్లో జరుగుతోన్న అభివృద్ధిని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోంది. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్లను తీసుకువచ్చాం. రైల్వేల ఆధునికీకరణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం దురదృష్టకరం’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

మూడో ట్రైన్ ప్రారంభించుకోవడం శుభపరిణం : కిషన్‌రెడ్డి
దేశంలో చారిత్రక, ప్రఖ్యాత111 నగరాలను అనుసంధానం చేస్తూ.. తొమ్మిది వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం గొప్ప విషయం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.- తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు వచ్చాయి. మరో వందే భారత్ రైళ్లును శుభపరిణామని ఆయన వెల్లడించారు. మూడు వందే భారత్ రైళ్లను ఇచ్చినందుకు ప్రధాని మోడీ, రైల్వే శాఖమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నేతలు, రైల్వేశాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News