Tuesday, January 21, 2025

సుందర గ్రామంగా వంగాల పంచాయతీ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: చిన్న గ్రామ పంచాయతీలతోటే గ్రామాభివృద్ధి సాధ్యమని వంగాల గ్రామపంచాయతీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం గుండాల మండలంలోని కొమ్మాయిపల్లి గ్రామంలో20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి అంబాల గ్రామంలో 9 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి20 లక్షలతో వంగాల గ్రామ ంలో నిర్మించిననూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి గుర్జు బావి పాచిర్ల గ్రామాలలో 20 లక్షలతో నిర్మించబో యే గ్రామ పంచాయితీ భవనానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమం త్రి కెసిఆర్ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేశారని బీడు భూములతో ఉన్న గుండాల మండలాన్ని నవా బ్ పేట రిజర్వాయర్ నుండి గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కెసిఆర్కే దక్కుతుందని అన్నారు. 2014 ముందు ఈ ప్రాంతమంతా ఎడారిగా ఉండేదని తెలంగాణ వచ్చినంక ఈ ప్రాంతానికి రోడ్ సౌకర్యం నీటి సౌకర్యం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సం క్షేమ పథకాలు తీసుకువచ్చి గ్రామాలను పచ్చ ధనం పరి శుభ్రతతో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న రాణి అన్నారు. వంగాల గ్రామానికి జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు రావడం ఇక్కడ ఉన్న సర్పంచు వార్డ్ మెంబర్ల కృషి అభినందనీయమని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనం నర్సరీ డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక ప్రతి గల్లీకి సిసి రోడ్డు వేసి గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాల అబ్బులు ఎంపీపీ తాండ్ర అమరావతి జడ్పిటిసి కోల్కొండ లక్ష్మి జిల్లా కో ఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్ మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొగల శ్రీనివాస్ ఎంపీటీసీ కర్ణ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News