Monday, January 27, 2025

ఇదేమి రాజ్యం రేవంత్: హరీష్ రావు

- Advertisement -
ఆసిఫాబాద్: వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మితో సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటు అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు మండిపడ్డారు. హరీష్ రావు తన సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోలతో సహా పోస్టు చేశారు. తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి చూపేందుకు వెళ్తున్న మీడియాను సైతం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు వేసి అడ్డుకోవడం అప్రజాస్వామికం, మీడియా స్వేచ్చను హరించడమేనని దుయ్యబట్టారు.
వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పేం లేదన్నట్లు వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోదన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం అంటూ దేశ వ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నాం కానీ, ఆ రాజ్యాంగ సూత్రాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా తుంగలో తొక్కుతుందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలు. ఇదేమి రాజ్యం అని సిఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News