Monday, December 23, 2024

చంద్రబాబు ఏజెంట్ రేవంత్‌రెడ్డి:వంటేరు ప్రతాప్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: ప్రతిపక్ష పార్టీలైన కాం గ్రెస్, బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉం దని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సిఎం క్యాంపు కార్యాలయంలో వి లేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే రోల్ మోడల్‌గా నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌దే అన్నారు. రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బిజెపి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. సిఎం కెసిఆర్ సారథ్య ంలో రైతులు ఇప్పుడు ఇప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్నాని ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నా యకులు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చె ప్పడం చాలా దారుణమన్నారు. గత కాంగ్రెస్ ప్ర భు త్వ హయాంలో రాత్రి 4 గంటలు, పగలు 3 గం ట లు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగేదని లోఓల్టెజీ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు పెలిపోయేవన్నారు. మూడు గంటల విద్యుత్ చాలని రేవంత్‌రెడ్డి, మో టార్లకు మీటర్లు పెడతామని బిజెపి చెప్పడం చూస్తు ంటే రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ప్రతి పక్షాల తీరుందని మండిపడ్డారు.

మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటున్న చంద్రబాబు వారసుడు, ఏజెం ట్ రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందా అని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మూడు గంటల విద్యుత్ కాంగ్రెస్ విధానమైతే మూడు గం టలు అనేది బిఆర్‌ఎస్ నినాదం అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎరువుల కోసం రైతులు క్యూలైను లో నిల్చుండే పరిస్థితి ఉండేదన్నారు. కరెంటు లేక పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలు చేసుకు న్న సంఘటనలు గత కాంగ్రె స్ హయాంలో ఉండేవన్నారు. చంద్రబాబు నాయు డు రేవంత్‌రెడ్డికి టిపిసిసి పదవి ఇప్పించాడని ఇవా ళ్ల కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి నాయకులు అంటున్నారని చెప్పా రు. రైతులను చైతన్య వంతం చేసి కాంగ్రెస్‌ని రేవం త్ రెడ్డిలను నిలదీసే విధంగా సభలు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇప్పటి వరకు 12 వేల ఆప్టికేషన్స్ వచ్చాయన్నారు. రోజు 250 మ ందికి లర్నింగ్ ఇస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆప్లై చేయని యెడల గజ్వేల్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆప్లికేషన్ పెట్టుకొవాలని తెలిపారు. గజ్వేల్ నియోజక వర్గంలో దాదాపు పదివేల మందికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టుకు నే ప్రతి ఒక్కరికి రాష్ట్రం తరుపున రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో వర్గ ల్ మండల పిఎసిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్, సర్పంచ్ సత్యం, నా యకులు కుమార్‌యాదవ్, నగేశ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News