Monday, December 23, 2024

నేడు విఎఒఎటి డైరీ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ: విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (విఏఓఏటీ) డైరీని ఆవిష్కరించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పి. అంజయ్య తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని ఆర్‌టిసి కళ్యాణ మండపంలో జరగనున్న ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాన్స్‌కో,జెన్‌కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు హజరుకానున్నట్లు తెలిపారు. గౌరవ అతిథిగా దక్షిణ తెలంగాణ విద్యుత్‌పంపిణీ సంస్థ( టిఎస్‌ఎస్‌పిడిసీఎల్) సీఎండి జి. రఘుమారెడ్డి,టిఎస్‌ఎన్‌పిడీసీఎల్ ఏ.గోపాల్ రావు ,ట్రాన్స్‌కో జేఎండి సి.శ్రీనివాసరావు,టిఎస్‌ఎస్‌పిడీసీఎల్ ఫైనాన్స్ డైరక్టర్‌లు నర్సింహరావు,టి.ఆర్‌కె.రావు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఆఫీసర్లు, పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News