మేషం: మేష రాశి వారు ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ చేతి వరకు వచ్చిన అవకాశాలు చేజారి పోతాయి. హెచ్ వన్ బి వీసా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తారు. కానీ సన్నిహిత వర్గం దీనికి భిన్నంగా ఉంటుంది మీపై దుష్ప్రచారం చేస్తారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇంట్లో కొంచెం అప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సంతానం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. దైవారాధన ఎక్కువగా చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చిన్న చిన్న విషయాలకు కూడా ఇబ్బంది పడే విధంగా గ్రహ స్థితి ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో భాగస్వాముల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. నూతన పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరికి ఏలిననాటి శని నడుస్తుంది. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన గృహం కొనుగోలు చేయాలని అనుకునేవారు కొద్ది కాలం వేచి ఉండండి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి దీనివలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా సకాలంలో పూర్తి అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చేతి వరకు వచ్చిన సంబంధాలు చేజారి పోతాయి. పోయింది అనుకున్న ఒక సంబంధం దైవానుగ్రహం వల్ల మళ్లీ మీ చెంతకు వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంటుంది. చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోతాయి. చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. కళా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. రావాల్సిన బాకీలు వివాదాస్పదం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రే. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మిథునం: మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఉద్యోగం మారాలని ఉద్దేశం ఏర్పడుతుంది. ఎంత కష్టపడినప్పటికీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. చిన్న చిన్న విషయాలలో కూడా చికాకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ సభ్యులతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అజీర్తి, చర్మ సమస్యలు ఈఎన్టీ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. సమయానికి ఆహారం, నిద్ర ముఖ్యమని గ్రహించండి. విద్యార్థిని విద్యార్థులకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మొత్తం మీద గతవారం కంటే ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. సంతాన కోసం ప్రయత్నం చేస్తున్న వారు సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ పని మొదలుపెట్టిన అది నిదానంగా సాగుతుంది. కొన్ని సందర్భాలలో ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామా అని ఆలోచన పదేపదే వస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలను తీసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈవారం ఓర్పు సహనం కలిగి ఉండండి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. ఋణాలు చాలా వరకు తీర్చి వేస్తారు. మానసికంగా ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. చిరు వ్యాపారస్తులకు మరియు నిత్యవసర సరుకులు అమ్మే వ్యాపారం చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు. కలిసి వచ్చే రంగు గ్రే. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. సౌర కంకణం ధరించండి.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా ఈ వారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురైన ఆటంకాలను అధిగమించగలుగుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. మంచి ఉద్యోగం సాధిస్తారు. విదేశాలు వెళ్లాలనుకునేవారు ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. కడుపునొప్పి, గ్యాస్టిక్, లివర్ సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా ఉన్న అడ్డంకులు ఈ వారం తొలగిపోతాయి. వ్యాపారం లాభాల బాటలో నడుస్తుంది. చార్టెడ్ అకౌంటెంట్స్ బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు బాగుంటాయి. మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ఆర్థికపరమైన జాగ్రత్తలు కొన్ని పాటించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కాకుంటే ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం బాగుంది. ఉద్యోగ పరంగా కూడా అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు ఏమి ఉండవు. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వివాహాలు ఇబ్బంది పెడతాయి. వివాహ విషయంలో పెద్దవాళ్ల మాటలు వింటే మేలు జరుగుతుంది. ఒక పనిని ప్రారంభించాలనుకుంటే నలుగురి సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకోండి. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు పెట్టిన పెట్టబడులకు లాభాలు బాగుంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ తెలివితేటలతో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారు. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు గ్రీన్. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి.
తుల: తులా రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా ఉన్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఈ వారం తొలగిపోతుంది.భాగస్వామ్య వ్యాపారాల నుండి తప్పుకొని మీరు సొంతంగా వ్యాపారం మొదలు పెడతారు. సమయపాలన పాటిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అన్ని నాకే తెలుసు అనే ధోరణిలో మీరు ఉంటారు. అమ్మకాలు కొనుగోలు లాభిస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వాహన యోగం ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్నేహితులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించాలి. ధనం విషయంలో అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు, కలిసి వచ్చే రంగు గ్రే. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని ప్రారంభించిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ పరమైన లీజులు కాంట్రాక్టులు లభిస్తాయి. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ పరంగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. నలుగురిలో పేరు తెచ్చుకోవ డానికి కష్టపడతారు. సంతానం కోసం ఎక్కువగా శ్రమిస్తారు. భూమి కొనాలనుకునే వారు డాక్యుమెంట్స్ ని పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. కాలభైరవ రూపును మెడలో ధరించండి. అష్టమూలిక తైలంతో నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. ఉద్యోగం మారవలసి ఉంటుంది. చేసిన పనిని పదేపదే చేయవలసి వస్తుంది. ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యంగా నైనా ప్రమోషన్స్ వస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఓర్పు సహనం కచ్చితంగా కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి హనుమాన్ చాలీసా ప్రతిరోజు వినండి దీనివలన మానసికంగా ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మీ కుటుంబంలో పెద్దవాళ్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు. హెచ్ వన్ బి వీసా లభిస్తుంది. మీకున్న తెలివితేటలతో అవకాశాలను అందుకుంటారు. గృహం కొనుగోలు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.
మకరం: మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వీరికి ఏలిన నాటి శని పూర్తయింది. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కెరియర్ పరంగా బాగుంది. ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. విదేశాలు వెళ్లాలనుకునే వారు విదేశీ ప్రయత్నాలు చేయవచ్చు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పైన దృష్టి పెట్టండి. స్థలాలు భూములు కొనుగోలు చేస్తారు. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. రుద్ర పాశుపత హోమం చేయించండి. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బందువర్గంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే తిరిగి రావడం కష్టమవుతుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఇంతగానో మేలు చేస్తాయి.ఉన్నత ఉద్యోగం కోసం, విద్య కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన కాలమని చెప్పవచ్చు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. హోటల్ వ్యాపారస్తులకు ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకు, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకున్న వారికి బాగుందని చెప్పవచ్చు. గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు పోటీ పరీక్షలలో పాల్గొనే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సంతానం మీ మాట వినకపోవడం మీ మనోవేదనకు కారణం అవుతుంది. సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్తు బాగుంటుంది. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం మరియు శనివారం రోజున ఆంజనేయస్వామి వారికి ఆకు పూజ చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.
మీనం: మీన రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళతారు. వృత్తి ఉద్యోగాలపరంగా స్థాన చలనం సూచిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఉన్నటు వంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి. రెండవ వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ఏలిననాటి శని నడుస్తుంది కాబట్టి కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఆర్థికపరంగా ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితుల యొక్క చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుండే పొదుపు పైన దృష్టి పెడతారు. సంఘసేవ కార్యక్రమంలో పాల్గొంటారు. విరాళాలు ఇస్తారు. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ప్రతి విషయంలో కూడా గోప్యత పాటించండి. ప్రస్తుతం వీరికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. నలుగురితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ప్రతిరోజు కూడా దుర్గాదేవి అష్టోత్తరం పాటించి కుంకుమార్చన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు.