Monday, January 13, 2025

వార ఫలాలు(08-12-2024 to 14-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం:   ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా బాగుందని చెప్పవచ్చు. వ్యాపార వ్యవహారాలలో కూడా ఈ వారం బాగుంటుంది. ఏ పని అనుకున్నా కానీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. పెండింగ్ లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏ వారం కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారల పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఉద్యోగ పరంగా చిన్నచిన్న ఒడిదుడుకులు ఏర్పడుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా నలుపు వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు ఎల్లో..

వృషభం:  వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. వృత్తి వ్యాపారాల పరంగా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. వృత్తి ఉద్యోగాలపరంగా ఈ వారం బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సినిమా రంగంలోని వారికి కళా రంగం వారికి ఈ వారం మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ వారం చివర్లో మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళ మరియు శనివారం రోజున నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే దిక్కు ఉత్తరం కలిసి వచ్చే రంగు తెలుపు..

మిథునం: మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి‌. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ కి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలపరంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయంలో కూడా మీదే పై చేయి అవుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరు ఆలస్యం అవుతాయి అనుకున్న పనులు ఈ వారం త్వరగా నే పూర్తవుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి మంగళవారము మరియు శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు గ్రీన్.

కర్కాటకం:  కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా కూడా ఒకటికి రెండుసార్లు చేయవలసి వస్తుంది. అయితే దైవానుగ్రహం వల్ల కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీకు రావాల్సిన స్థిరాస్తులు మీ చేతికి వస్తాయి. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా చిన్నచిన్న ఒడిదుడుకులు ఉంటాయి. ముఖ్యంగా బాగా సౌమ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. విద్యార్థిని విద్యార్థులు చదువు పైన శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు కాలభైరవాష్టకం చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ వ్యాపారపరంగా అంతా అనుకూలంగా ఉండదు. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహది శుభకార్యాల విషయంలో మీకంటూ ఒక స్పష్టత వస్తుంది. అయితే మీకు నచ్చిన సంబంధం ఇంట్లో వాళ్లకి నచ్చకపోవడం ఇంట్లో వాళ్లకి నచ్చిన సంబంధం మీకు నచ్చకపోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగులపరంగా బాగుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య ఒకటి, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్య: కన్యా రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మీరు చేస్తున్న పనిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీకంటూ ఒక స్థానం సంపాదించుకోగలుగుతారు.  ఏ పని చేసిన ఆలోచించి చేయండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ వారం బాగుంది. అనుకోకుండా విదేశీ ప్రయాణం చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చేది కుతుర్పు కలిసి వచ్చే రంగు గ్రీన్.

తుల : తులా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఒత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని కొన్ని పనులు నిదానంగా చేయడం అనేది చెప్పదగినది. ఒకరి మెప్పు కోసం చేసే పనులు తర్వాతి కాలంలో ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది‌. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం చదువుకోవడం మరియు కాలభైరవ దర్శనం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే..

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నరదిష్టి అధికంగా ఉంటుంది. కష్టపడిన దానికి ఫలితం అంతంతమాత్రంగా ఉంటుంది.   విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. ప్రస్తుతం ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య పరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రతిరోజు కూడా గురు గ్రహ స్తోత్రం మరియు శని గ్రహ స్తోత్రం ఎక్కువగా చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ..

ధనస్సు:  ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం చేసుకొనేటప్పుడు జాతక పరిశీలన చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు నిర్మాణ రంగంలో ఉన్న వారికి బాగుందని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. రాజుల జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5, కలిసివచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.

మకరం:   మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించ గలుగుతారు. అయితే అధిక శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఇంత కష్టపడినప్పటికీ ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్న చిన్నచిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో అన్ని ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళండి.  విద్యార్థిని విద్యార్థులు మరియు మెరిట్ మార్కుల కోసం ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు.  ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పాశుపత హోమం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు, కలిసి వచ్చేది దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే..

కుంభం:  కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసిన పనిని ఒకటికి రెండు సార్లు చేయవలసి వస్తుంది. ఉద్యోగ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకున్న తెలివితేటలను సన్మార్గంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా ఈ వారం చాలా బాగుంది. మీరు ఆశల జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అందర్నీ నమ్మడం అనేది మంచి పద్ధతి కాదు. నూతన ప్రాజెక్టులు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుందని చెప్పవచ్చు. శని ప్రభావం తగ్గడానికి ప్రతి రోజు కూడా కాలభైరవాష్టకం లేదా శని గ్రహ స్తోత్రం ఎక్కువగా చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు బ్లూ..

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News