Wednesday, January 22, 2025

కృష్ణుడు బ్యాక్‌డ్రాప్‌లో ‘వరదరాజు గోవిందం‘

- Advertisement -
- Advertisement -

సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి.సముద్ర తాజాగా రవి జంగు హీరోగా ప్రీతి కొంగన హీరోయిన్ గా శివమహాతేజ ఫిలిమ్స్, వి.సముద్ర మూవీస్ బ్యానర్లపై విజయలక్ష్మీ సమర్పణలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మాతగా ‘వరదరాజు గోవిందం‘ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. కాగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగిన ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ప్రముఖ హీరో సుమన్, నటుడు శుభలేఖ సుధాకర్, హీరో రవి జంగు, హీరోయిన్ ప్రీతి కొంగన, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహరావు, ముప్పలనేని శివ, చంద్రమహేష్, రవికుమార్ చౌదరి, శివనాగు, నగేష్ నారదాసి, గోసంగి సుబ్బారావు, అమ్మరాజశేఖర్, నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, ఛాంబర్ కార్యదర్శి కె.యల్. దామోదర ప్రసాద్, నిర్మాతలు కేకే రాధామోహన్, డిఎస్ రావు, శోభారాణి, నటులు దాసన్న, ఖదీర్, జోహార్, సంగీత దర్శకుడు డా. రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దర్శకులంతా కలిసి ’వరదరాజు గోవిందం’ మోషన్ పోస్టర్ లాంచ్ చేయగా… నిర్మాతలందరూ కలిసి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత వి. సముద్ర మాట్లాడుతూ “కృష్ణుడు బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, రవితేజ లాగా హీరో రవి జంగు ఫుల్ ఎనర్జిటిక్‌గా చేశాడు. హీరోయిన్ ప్రీతి అద్భుతంగా చేసింది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News