Monday, December 23, 2024

వార ఫలాలు (17-09-2023 నుండి 23-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అదే విధంగా బంధువర్గంలో మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. శత్రువర్గంవారు కూడా అభినదించేలా నలుగురిలో గుర్తింపబడతారు. వ్యవసాయదారులకు మంచి అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు ఈవారం అన్ని విధాలుగా బాగుంటుంది. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. తలపెట్టిన పనులను ద్విగిజయంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఈవారం అనుకూలంగా ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. భూములు కొనుగోలు చేసేటపుడు అన్ని పత్రాలను పరిశీలంచడం చెప్పదగిన సూచన. కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది. కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన.

వృషభం: ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈవారం సానుకూలంగా యథావిధిగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే మీరు సాఫీగా ఉన్నప్పటికీ శత్రువర్గం నుండి ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా శారీరక సమస్యల కంటే చిన్నపాటి మానసిక ఆందోళనలు, టెన్సన్స్‌వంటి ఉండే అవకాశములున్నాయి. అయితే స్నేహవర్గం సహాయ సహకారములతో కొంత ఊరట చెందడం అనేది జరుగుతుంది. వారం ప్రథమార్ధంలో మొదలుపెట్టిన పనులు ద్వితీయార్థంలో మంచి అనుకూలమైన శుభ ఫలితములను ఇస్తాయి. కళాకారులకు, సినిమా రంగం వారికి మంచి అనుకూలమైన సమయం. జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

మిథునం: ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన పనులను, విధి నిర్వహణలను నిర్లక్ష్యం చేయకుండా నిర్వర్తించడం చెప్పదగిన సూచన. ఇప్పుడు మీరు చిన్న పొరపాటు చేస్తే మీ పైఅధికారులు కానీ, సహా ఉద్యోగస్తులు కానీ అది ఆసరాగా తీసుకుని మీ మీద బురదజల్లే అవకాశములున్నాయి. వ్యాపారస్తులకు లాభముల విషయంలో యథావిధిగా ఉంటుంది. అంతర్గత విమర్శలు తప్పవు. బంధువర్గంలో, స్నేహవర్గంలో కూడా మాట పట్టింపులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి. ముత్యపు గణపతి లాకెట్ ధరించడం చెప్పదగిన సూచన

కర్కాటకం: ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అభివృద్ధి కనబడుతుంది. ఆర్ధిక లాభములు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. పాత సమస్యలను, పనులను పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబములో, స్నేహవర్గంలో కూడా సానుకూలత ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. కొత్త వ్యవహారములు, ప్రణాళికలు వంటివి మొదలు పెట్టడం అంత మంచిది కాదు. కొంత నిదానాన్ని ఏర్పరచుకోండి. మాట్లాడేటప్పుడు జాగర్త అవసరం. ప్రయాణములలో, వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహం: ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, అనుకున్న ఫలితములు ఆలస్యం అవ్వడం వంటి ఇబ్బందులు కలిగే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభములు తక్కువగా ఉండడం లేదా కొద్దిపాటి నష్టములు చవిచూసే అవకాశములు ఉన్నాయి. కొద్దిపాటి టెన్షన్స్ ఉంటాయి, పట్టుదలకు పోవడం మంచిది కాదు. మాటల కారణంగా శత్రువర్గం ఎక్కువ అయ్యే అవకాశములు ఉన్నాయి. అనాలోచిత ఖర్చులు ఉంటాయి. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. హామీలు, సంతకాలు వంటివి చేయవద్దు. మోసపోయే అవకాశములు ఉన్నాయి. కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన.

కన్య: ఉద్యోగస్తులకు పైఅధికారులతో ప్రతికూల ఫలితాలు, మానసిక ఒత్తిడి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. కష్టపడ్డాము కదా ఫలితాలు రాకపోగా ఈ అపవాదులు ఏమిటి అన్న మీ మనస్సు మనోవేదనకు గురిఅవుతారు. వ్యాపార వ్యవహారములు యందు నిరాదరణ, ఆలస్య ఫలితాలు ఉండే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. బయట ఉండే సమస్యలు, చికాకులు కుటుంబంలో అశాంతికి కారణం అవుతాయి. కొంత ఆలోచించి ప్రశాంతముగా మాట్లాడండి. స్నేహితులతో అనుకూలత ఉంటుంది. ఆర్ధికపరంగా అవసరముల మేరకు ధనం చేతికి అందుతుంది. నిత్యం శని స్తోత్రం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన

తుల: ఈ వారం ప్రథమార్ధం కంటే, ద్వితీయార్థంలో మంచి అనుకూలమైన ఫలితములు, అనుకోని అదృష్టం వంటివి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మానసిక ఒత్తిడి, వర్క్ ప్రెషర్ వంటివి ఉండే అవకాశములు ఉన్నాయి. అనుకున్న సమయానికి పనులు చేసుకోండి. నిర్లక్ష్యం పనికి రాదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. యువతీ యువకులు విలాసములు, వ్యసనముల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన.ఓం నమః శివాయ, వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన

వృశ్చికం: ఉద్యోగస్తులకు అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. అధికారులతో సానుకూలత, అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్ వేర్ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు సైతం ఆర్ధిక పరమైన లాభములు అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల విషయంలో ఆలోచనలు కొలిక్కి వస్తాయి. సర్వత్రా కొత్త పనులు ప్రారంభించుటకుమంచి సమయం. కొత్తగా ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి ఉద్యోగావకాశములు గోచరిస్తున్నాయి. మీ తెలివితేటలు, అదృష్టం కారణంగా చేసే పని యందు అభివృద్ధి ఉంటుంది. కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు: ధనస్సు వారికీ ఈవారం అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు అభివృద్ధి ఉంటుంది.వ్యాపారస్తులకు క్రమక్రమాభివృద్ధి ఏర్పడుతుంది. గతంలో కంటే కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్ధికంగా కూడా అభివృద్ధి ఉంటుంది. కొత్త పనులకు కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ పనులు తొందరగా పూర్తవుతాయి. వారం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకున్నంత జీతంతో ఉద్యోగం రాకపోవచ్చు. కానీ ప్రయత్నములు ఫలిస్తాయి. హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

మకరం: ఈ వారం ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతీ విషయంలో ఆలోచించి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా నష్టములు లేనప్పటికీ తక్కువ లాభములు ఉండే అవకాశములు ఉన్నాయి. తెలియని అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. కుటుంబంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. వారం ద్వితీయార్థంలో కొంత అనుకూలమైన ఫలితములు ఉంటాయి. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణములలో, వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగ్గ సూచన. విద్యార్ధిని విద్యార్థులకు కొద్దిపాటి టెన్సన్స్ ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో రాణిస్తారు. నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

కుంభం: ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిడిలు, ఉద్యోగంలో మార్పుల కోసం ఆందోళనలు ఉండే అవకాశములు ఉన్నాయి. కంగారు పడి నిర్ణయాలు తీసుకోకండి. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ప్రయత్నములు ఫలించినప్పటికీ ఆర్ధికంగా అనుకున్న అభివృద్ధి ఉండకపోవడం మానసిక అసంతృప్తిని కలుగచేస్తుంది. తొందరపడి ఉద్యోగంలో మార్పులు లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. కొత్తగా ఋణములు, లోన్లు వంటివి తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త వహించాల్సిన సమయం. వ్యాపారస్తులకు ఈవారం అనుకూలంగా ఉంటుంది. 3 పోగుల వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన

మీనం: ఉద్యోగస్తులకు, సాధారణంగా, సామాన్యంగా గోచరిస్తుంది. లాభనష్టములు వంటివి కాకుండా సానుకూలంగా ఉంటుంది. అయితే కొత్తపనులు, ప్రణాళికలు అమలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ప్రశంసలు అందుకుంటారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు అభివృద్ధి ఏర్పడే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేపట్టే పనులలో పురోగతి కనిపిస్తోంది. కుటుంబలో చిన్నపాటి కలహములు ఉండే అవకాశములు ఉన్నాయి. వృథా ప్రయాణములు ఉండవచ్చు. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. స్నేహితుల అండదండలు లభిస్తాయి. కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన.

Saturday rasi phalalu

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News