Sunday, December 22, 2024

జనవరి 24న జ్ఞానవాపి మసీదు సర్వే వెల్లడి

- Advertisement -
- Advertisement -

వారణాసి : జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి సీల్డ్ కవర్‌లో అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికను ఈనెల 24న బహిర్గతం చేయడానికి వారణాసి కోర్టు శనివారం నిర్ణయించింది. ఈ నివేదిక కాపీలు కక్షిదారులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. జిల్లా జడ్జి ఎకె విశ్వేష్, హిందువుల తరఫు న్యాయవాది మదన్‌మోహన్ యాదవ్ ఈమేరకు ఉత్తర్వు విడుదల చేశారు. ఈ సందర్భంగా హిందూ , ముస్లిం సమాజాలకు చెందిన న్యాయవాదులు, ఆర్కియాలజీ సర్వే ప్రతినిధులు కోర్టుకు హాజరయ్యారు. గత జులై 21న జిల్లా కోర్టు ఆదేశాలపై జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఎఎస్‌ఐ శాస్త్రీయ పరిశోధనలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సర్వేను బహిర్గతం చేసే విషయాన్ని సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగిన తరువాత నిర్ణయించడమౌతుందని వారణాసి కోర్టు వెల్లడించింది.

అయితే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ విచారణను జనవరి 19న విచారించడానికి షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 19న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ ఈ సర్వే నివేదికను మరో నాలుగు వారాల పాటు బహిర్గతం చేయవద్దని ఎఎస్‌ఐ బుధవారం వారణాసి కోర్టుకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఎఎస్‌ఐ తరఫు న్యాయవాది అమిత్‌శ్రీవాస్తవ ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఉత్వర్వు వివరాలను ప్రస్తావించారు. సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అవసరమైతే మరోసారి సర్వే చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయవచ్చని అలహాబాద్ కోర్టు పేర్కొన్నట్టు వివరించారు. అందువల్ల ఈ సర్వే నివేదిక ఇప్పుడు బహిర్గతమైతే వైరుధ్య పరిస్థితి ఏర్పడుతుందని అమిత్‌శ్రీ వాస్తవ వారణాసి కోర్టు దృష్టికి తెచ్చారు. అందువల్ల సర్వే నివేదిక బహిర్గతం చేయడానికి నాలుగువారాల సమయం తప్పనిసరి అని ఆయన వివరించారు. అయితే ఈ నివేదిక కాపీలను కక్షిదారులకు లభ్యం అయ్యేలా చూడాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News