Wednesday, January 22, 2025

జ్ఞానవాపి మసీదు శాస్త్రీయ సర్వే వారణాసి హైకోర్టు ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

వారణాసి : స్థానిక కాశీవిశ్వనాధ దేవాలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు శాస్త్రీయ సర్వేకు వారణాసి కోర్టు శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాది రాజేష్ మిశ్రా తెలిపారు.ఈ మసీదు హిందూ ఆలయ స్థలంలో నిర్మించారనే అంశంపై వ్యాజ్యం సాగుతోంది. హిందూ సంస్థల కక్షిదార్లు ఈ ప్రాంగణంలో ఉన్నదని చెపుతున్న శివలింగ ఇప్పటి వాజూఖానా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఈ ప్రాంతాన్ని శాస్త్రీయ అధ్యయన ప్రక్రియ నుంచి మినహాయించారు.ఎకె విష్వేష్‌తో కూడిన ధర్మాసనం హిందూ భక్తులు దాఖలు చేసిన పిటిషన్ సబబే అని సమర్థించింది. మసీదు పూర్తిగా హిందూ ఆలయ పరిధిలోకి వస్తుందని, ఇక్కడనే మసీదును కట్టడం అక్రమమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనల తరువాత కోర్టు ఈ నెల 14న తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు తీర్పు క్రమంలో మసీదు సైంటిఫిక్ సర్వే నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News