Wednesday, November 13, 2024

జ్ఞానవాపి మసీదుపై కోర్టు కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

 

Gyanvapi Mosque

లక్నో: జ్ఞానవాపి కేసు విషయంలో వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తిరస్కరించింది. మసీదు ఆవరణలోని శృంగార గౌరి ప్రతిమకు పూజలు చేసేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. సెప్టెంబర్ 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. వారణాసి కోర్టు తీర్పును హిందూ సంఘాలు స్వాగతించగా, తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు అంజుమన్ ఇంతజామియా కమిటీ పేర్కొంది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో ఓ శివలింగాకారం బయటపడిందని హిందూ సంఘాలు వాదిస్తుండగా, అది శివలింగం కానే కాదని మసీదు కమిటీ వాదిస్తోంది. కాగా అక్కడ పూజలు చేసుకోడానికి అనుమతించాలని ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారం మళ్లీ వారణాసి కోర్టుకే చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News