Friday, November 15, 2024

వారణాసి హోటల్ రూమ్ నుంచి మంత్రి లగేజీ తొలగింపు

- Advertisement -
- Advertisement -

వారణాసి: బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు వారణాసి లోని ఓ హోటల్‌లో అవమానం జరిగింది. ఆయనకు చెందిన లగేజీని ఆయనకు తెలియకుండానే నిర్లక్ష్యంగా రూమ్ నుంచి తొలగించారు. కాశీ విశ్వనాధుడి దర్శనానికి ఆయన వెళ్లినప్పుడు హోటల్ రూమ్‌లో ఉన్న లగేజీని బయటకు తీసి రిసెప్షన్ కౌంటర్ వద్ద పెట్టారు. మంత్రి తేజ్ పర్సనల్ అసిస్టెంట్ విశాల్ సిన్హా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంత్రికి రూమ్ కేటాయించిన తరువాత ఆ రూమ్ నుంచి ఎలా లగేజీని తీసివేస్తారని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి దర్శనం తరువాత తేజ్‌ప్రతాప్ హోటల్‌కు రాగానే ఆయన లగేజీ రిసెప్షన్ వద్ద ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందని మంత్రి పెర్సనల్ అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఏసీపీ సంతోష్ సింఘ్ వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 6న బీహార్ పర్యావరణశాఖ తరఫున రూమ్ బుక్ అయిందని, కానీ 7న మరొకరికి రూమ్ బుక్ అయినట్టు ఆయన తెలిపారు. ఇంతకీ ఆ రూమ్ ఎవరిపేరిట బుక్ చేశారో హోటల్ మేనేజ్‌మెంట్‌కు తెలియదని, తేజ్ ప్రతాప్ యాదవ్ కోసం యాజమాన్యం చాలా సేపు చూసిందని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News