Wednesday, January 22, 2025

సంక్రాంతి కానుకగా ‘వారసుడు’

- Advertisement -
- Advertisement -

Nayanthara will pairs with Balakrishna

దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ తో ప్రేక్షకులని మైమరపించారు విజయ్. ‘వారసుడు’ చివరి షెడ్యూల్ షూటింగ్ ఆదివారం ప్రారంభమైయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి కేవలం 2 యాక్షన్ సీక్వెన్సులు, 2 పాటలు మాత్రనే మిగిలివున్నాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్యాలెంటడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం యూనివర్సల్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. ఈ చిత్రం కోసం బ్లాక్ బస్టర్ స్క్రిఫ్ట్‌ను తయారు చేసిన దర్శకుడు వంశీ విజయ్‌ను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో చూపిస్తున్నారు. రష్మిక మందన్న ఈ చిత్రం లో కథానాయికగా నటిస్తుంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్త్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News