Monday, December 23, 2024

కొత్త లుక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా

- Advertisement -
- Advertisement -

'Varasudu' Movie Shoot Stills Viral 

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’/ వారిసు’ చిత్రం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబధించిన పది స్టిల్స్ ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ’వారసుడు’ స్టిల్స్ వైరల్‌గా మారాయి. ‘వారసుడు’లో విజయ్ కొత్త లుక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్‌తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్‌లో కనిపించారు. అలాగే విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘వారసుడు/వారిసు’ని విడుదల చేస్తున్నట్లు దీపావళి పండగ నాడు మేకర్స్ ప్రకటించారు. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక.

‘Varasudu’ Movie Shoot Stills Viral 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News