Thursday, January 23, 2025

ఎప్పుడూ గెలిచేది మంచి కథే..

- Advertisement -
- Advertisement -

దళపతి విజయ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లిల ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వారసుడు’ సంక్రాంతి కానుకగా విడుదలైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమా ఘన విజయాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ని నిర్వహించింది. సక్సెస్ టూర్‌లో భాగంగా వైజాగ్ లో పర్యటించిన చిత్ర యూనిట్ అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సమావేశంలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ “ విజయంతో పాటు గౌరవం రావాలనేది నా, దిల్ రాజు ప్రయత్నం. ఊపిరి, మహర్షి అలా చేసిన చిత్రాలే. ఇప్పుడు ‘వారసుడు’తో మరోసారి మా ప్రయత్నం విజయం సాధించింది. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనని ఏ రూపంలోనూ బెరీజు వేయలేం. ఈ అనుభూతిని జీవితంలో మర్చిపోలేం”అని తెలిపారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “ఎప్పుడూ గెలిచేది మంచి కథ. వంశీ అనుకున్న మంచి కథకు విజయ్ తోడయ్యారు. దీంతో ఒక మంచి సినిమా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

అందుకే ఇంత గొప్ప కలెక్షన్లు, ప్రశంసలు వస్తున్నాయి”అని అన్నారు. తమన్ మాట్లాడుతూ.. “వారసుడు చిత్రం కోసం ఒక ఏడాది పాటు ప్రయాణించాం. బ్యూటీఫుల్ జర్నీ ఇది. సినిమా కోసం వంద శాతం కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ‘వారసుడి’ని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. పాటలు, నేపధ్య సంగీతానికి మంచి పేరు రావడం ఆనందంగా వుంది”అని చెప్పారు. ఈ సమావేశంలో సంగీత, కిక్ శ్యామ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News