Monday, December 23, 2024

14న వస్తున్న ‘వారసుడు’..

- Advertisement -
- Advertisement -

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం ‘వారసుడు/వారిసు’ తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోమవారం ‘వారసుడు’ తెలుగు విడుదల తేదిని తెలియజేస్తూ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “వారసుడు’ చిత్రాన్ని సంక్రాంతి వారసుడిగా జనవరి 14న విడుదల చేస్తున్నాం.

తమిళ్‌లో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న ఈ సినిమా విదుదలవుతుంది. ఈ నిర్ణయం వెనుక వున్న కారణం.. జనవరి 12న బాలకృష్ణ ‘ వీరసింహా రెడ్డి’, జనవరి 13న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి థియేటర్‌లో ముందు మన తెలుగు బిగ్గర్ స్టార్స్ సినిమాలు పడాలి. అన్ని చోట్ల వారికి థియేటర్లు దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. సంక్రాంతి సినిమాలకి మా ‘వారసుడు’ పోటి కాదని మొదటి నుండి చెబుతున్నాను. మాది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

ఇందులో ఫ్యామిలీ కోణంలో ఒక కొత్త పాయింట్ చెబుతున్నాం. సినిమా చూసి వచ్చేటప్పుడు ఆ పాయింట్ ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది. ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా ఫీలవుతారు. ఒక మంచి సినిమా చూశామని ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటికి వస్తారు”అని అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ “వారసుడు… యునివర్సల్ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. విజయ్‌తో ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News