Thursday, January 23, 2025

‘వారసుడు’ మంచి ఫ్యామిలీ సినిమా..

- Advertisement -
- Advertisement -

దళపతి విజయ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లిల ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వారసుడు/వారిసు’. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈనెల 11న తమిళ్‌లో విడుదలైన ‘వారిసు’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అక్కడ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. శనివారం ‘వారసుడు’ తెలుగులో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సమావేశంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ “నా జీవితంలో కుటుంబానికి చాలా ప్రాధాన్యత వుంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనకు తోడుగా వుండేది మన కుటుంబమే. ప్రతి కుటుంబంలో లోపాలు వుంటాయి. కానీ ఉన్నది ఒక కుటుంబం. ఈ ఆలోచనతోనే ‘వారసుడు’ కథ పై వర్క్ చేశాం. విజయ్‌కు కథ చెబితే ఒకే ఒక సిట్టింగ్‌లో ఓకే అయిపోయింది. అయితే విజయ్‌తో ఈ సినిమా చేస్తున్నామన్న తర్వాత టెన్షన్ మొదలైయింది. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. ఆయనకు సరిపడే విధంగా ఈ సినిమా చేయడం కోసం మంచి టీంను సెట్ చేశాం.

తమిళ్‌లో ‘వారిసు’ సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమాని ప్రేమించడానికి ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి ఉండాల్సిన ప్రత్యేకత ఈ సినిమాకి వుంది. శరత్‌కుమార్, జయసుధ నటన గురించి అద్భుతంగా రాస్తున్నారు. అమ్మ నిజం, నాన్న నమ్మకం… అదే ఈ సినిమాలో చూస్తారు”అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ “మీడియా ప్రతినిధుల కోసం ‘వారిసు’ స్పెషల్ షోని ఈనెల 10న వేశాం. నిజానికి ఇది రిస్క్. కానీ సినిమాపై మాకు నమ్మకం వుంది. సినిమా బావుందనే నమ్మకం వున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు.

మీడియా, ఫ్యామిలీ షోకి అద్భుతమైన స్పందన వచ్చింది. క్లైమాక్స్ పుర్తవగానే వంశీని హాగ్ చేసుకున్నా. ప్రేక్షకులు అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తర్వాత 11న ఉదయం ఆడియన్స్ షోకు వెళ్లాం. ఆడియన్స్ అంతా నిలుచుని క్లాప్స్ కొట్టారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణతో మేము పడ్డ కష్టాలు మర్చిపోయాం. ఈ సినిమా కోసం వంశీ, తమన్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. బొమ్మరిల్లు సినిమాని శాంతి థియేటర్ లో చూస్తున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తే నేను ఏడ్చా. మళ్ళీ ఇన్నాళ్లకు ‘వారసుడు’ చూస్తున్నపుడు కన్నీళ్లు వచ్చాయి. ఇది అనుకున్నది నిజం కావడం వలన వచ్చే ఆనందం.

సినిమాకు కనెక్ట్ అయితే ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణ ఇది.ఇక శనివారం సంక్రాంతికి ‘వారసుడు’గా తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా పెద్ద హిట్ చేస్తారు. సంక్రాంతికి ప్రేక్షకులు ఒక ఫ్యామిలీతో వెళ్లి మంచి సినిమాని చూడాలని అనుకుంటున్నారు. అలాంటి మంచి ఫ్యామిలీ సినిమానే వారసుడు”అని చెప్పారు. జయసుధ మాట్లాడుతూ “వారిసు… తమిళ్‌లో పెద్ద విజయాన్ని సాధించింది. 2023 ఆరంభంలో ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఫ్యామిలీ డ్రామాలో హార్డ్ వర్క్ ఏమిటని అనుకోవచ్చు. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తమన్, శరత్ కుమార్, శ్రీకాంత్, శ్యామ్, హరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News