- Advertisement -
ఫిబ్రవరి 5 వరకు వరవరరావుకు బెయిల్ పొడిగింపు
ముంబై: ప్రస్తుతం మెడికల్ బెయిల్‌పై ఆసుపత్రిలో ఉన్న ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితుడు విప్లవ కవి వరవరరావు బెయిల్ గడువును బొంబాయి హైకోర్టు ఫిబ్రవరి 5వ తేదీ వరకు పొడిగించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న తరుణంలో 83 ఏళ్ల వరవరరావును తలోజా జైలుకు పంపడం సబబు కాదని జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టిస్ ఎన్‌ఆర్ బోర్కర్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం ఎన్‌ఐఎకు తేల్చిచెప్పింది. వరవరరావు బెయిల్ గడువును మరో వారం మాత్రమే పొడిగించాలన్న ఎన్‌ఐఎ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణ ఖైదీగా నవీ ముంబైలోని తలోజా జైలులో ఉన్న వరవరరావుకు ఆరు నెలల పాటు మెడికల్ బెయిల్ మంజూరు చేస్తూ 2021 ఫిబ్రవరిలో హైకోర్టు మంజూరు చేసింది. వివిధ రుగ్మతులతో బాధపడుతున్న వరవరరావు ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
- Advertisement -