Tuesday, December 24, 2024

ధర్మ ప్రచార కేంద్రంగా వర్గల్ విద్యాధరి క్షేత్రం

- Advertisement -
- Advertisement -
  • జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతి

వర్గల్: హిందూ ధర్మ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ లక్ష్యంగా వర్గల్ విద్యాధరి క్షేత్రం విరాజిల్లుతోందని జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. స్వామివారి విజయ యాత్రలో భాగంగా ఆదివారం వర్గల్ క్షేత్రానికి అనుబంధంగా నిర్మించిన కంచి మఠం, శారదా స్మార్త వేద విద్యాలయాలను కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రారంభించారు. అనంతరం భక్తులనుదేశించి స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ వర్గల్ క్షేత్రానికి కంచి మఠానికి ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. విద్యా సరస్వతి దివ్య ధామం, విభిన్న ఆలయాల సమూహంతో ధర్మనిష్ఠకు ప్రతీకగా వికసించిందని తెలిపారు. వేద విద్యా పరిరక్షణతోపాటు అన్నదానం, ధర్మప్రచారం చక్కగా, ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నట్లు కొనియాడారు.

క్షేత్ర వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అకుంఠిత దీక్ష, అమ్మవారి ఆశీస్సులు క్షేత్రవికాసానికి కారణాలని చెప్పారు. ముఖ్యంగా సంస్కృతి, ధర్మరక్షణ, సాంప్రదాయాలు జీవన విధానం కావాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక చైతన్యంతో ఆది శంకరులు ధర్మ పరిరక్షణకు శ్రమించగా, అదే స్ఫూర్తితో దక్షిణ భారత దేశంలో ధర్మం, శాస్త్రం, ప్రాచీన నాగరికత రక్షించుకోవాలని అన్నారు. జీవితం పరిమితమైనదని, ఆదిశంకరుల స్ఫూర్తి , ప్రేరణతో ధర్మం సంస్కృతితో కూడిన అభివృద్ధి జరగాలని తెలిపారు.

ఆచార వ్యవహారాలు పరిరక్షించుకుంటూ సంస్కృతి సంప్రదాయాలు హిందూ జీవన విధానం పురాతన క్షేత్రాలు తదితర వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుఎరగాలని సూచించారు. కాగా మొదటగా వర్గల్ ప్రధాన కూడలిలో కంచి స్వామివారికి భక్తులు హిందూ ధర్మ పరిరక్షకులు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు . అనంతరం స్వామి వారు శోభాయాత్రతో విద్యాధరి క్షేత్ర సముదాయానికి చేరుకోగా ఆలయ చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు జగద్గురువులు కంచి స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News