అమరావతి: సిఎం జగన్ మోహన్‌రెడ్డిపై రాయి పడటం అతి చిన్న స్టేజ్ డ్రామా అని తెలుగు దేశం నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే వైసిపి నేతలు ధర్నా చేశారని, పది నిమిషాల్లోనే ప్లకార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇలా జరుగుతుందని కొందరు నేతలు, పోలీసులకు ముందే తెలుసునని, కరెంట్ పోయిన వెంటనే భద్రతా సిబ్బంది జగన్‌కు ఎందుకు రక్షణ కల్పించలేదని వర్ల రామయ్య అడిగారు. ఘటన జరిగిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్‌పై ఆరోపణలు చేశారని, హత్యాయత్నం చేశాడని ఎవరినో ఒక వ్యక్తిని తీసుకవస్తారని, సిబిఐ దర్యాప్తు కోరుతున్నామని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని, ఘటన ఎలా జరిగిందో జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే తెలుసునని వర్ల రామయ్య చురకలంటించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌నగర్‌లో గంగానమ్మ గుడికి సమీపంలో ‘మేమంతా సిద్ధం’ సందర్భంగా సిఎం జగన్ యాత్ర చేస్తుండగా ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
జగన్ పై రాయి పడటం అతి చిన్న స్టేజ్ డ్రామా: వర్ల రామయ్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -