Wednesday, January 22, 2025

ఎసిబి వలలో వర్ని ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా, వర్ని ఎస్‌ఐ కృష్ణ కుమార్ ఎసిబి వలలో చిక్కుకున్నారు. స్టేషన్ బెయిల్ కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు ఆయనను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…మండల కేంద్రంలోని కోటయ్య క్యాంపునకు చెందిన మాజీ ఎంపిటిసి నాగరాజు మరో వ్యక్తితో గొడవ పడడంతో అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. స్టేషన్ బెయిల్ కోసం రూ.50 వేలు ఇవ్వాలని బాధితుడు నాగరాజును ఎస్‌ఐ డిమాండ్ చేశారు.

దీంతో రూ.20 వేలు మాత్రమే తాను ఇవ్వగలనని ఎస్‌ఐకి చెప్పి, ఎసిబిని ఆశ్రయించాడు. శుక్రవారం ఎసిబి డిఎస్‌పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బాధితుడి నుంచి ఎస్‌ఐ కృష్ణకుమార్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిబి డిఎస్‌పి తెలిపారు. ఈ దాడుల్లో ఎసిబి డిఎస్‌పితో పాటు ఇన్స్‌పెక్టర్లు శ్రీనివాస్, వేణు గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News