Wednesday, January 22, 2025

గిరిజన అమ్మాయిగా కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ’ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ నేపధ్యంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ మీడియాతో మాట్లాడుతూ… “దర్శకుడు విఐ ఆనంద్ చెప్పిన కథ నాకు చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. అసలు ఇలాంటి కథ ఎలా ఆలోచించగలిగారో అనిపించింది. ఇందులో భూమి అనే గిరిజన అమ్మాయిగా కనిపిస్తాను. భూమి తన ఊరిలో తనొక్కరే చదువుకున్న అమ్మాయి. చూడటానికి అందంగా అమాయకంగా కనిపిస్తుంది.

తప్పుని నిలదీసే ధైర్యం వున్న అమ్మాయి. ఆ పాత్ర బలం సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అర్ధమవుతుంది. స్వాతిముత్యం, మిడిల్ క్లాస్ మేలోడీస్ చిత్రాల్లో గర్ల్ నెక్స్ డోర్ పాత్రల్లో కనిపించాను. ఇందులో మాత్రం గర్ల్ నెక్స్ ఫారెస్ట్ పాత్ర అనాలి. ట్రైలర్‌లో చూస్తే నాకు ఒక యాక్షన్ సీన్ వుంటుంది. భూమి పాత్రలో చాలా బలం, శక్తి ఉంది. ’ఊరు పేరు భైరవకోన’ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకునికి ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News