Thursday, December 26, 2024

అతడిని సెలెక్ట్ చేయకపోతే ఘోర తప్పిదం అవుతోంది: కార్తీక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణాప్రికాతో జరుగుతున్న రెండో టి 20లో ఐదు వికెట్లు తీయడంతో మొదటి టి20లో మూడు వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తి ఔరా అనిపించాడు. తన స్పిన్ బౌలింగ్ మాయతో సపారీ ఆటగాళ్లకు కళ్లెం వేస్తున్నాడు. వన్డేలలో కూడా వరుణ్ ను తీసుకోవాలని క్రికెట్ పండితులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వరుణ్ చక్రవర్తికి వన్డేలలో కూడా అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెట్ దినేష్ కార్తీక్ అభిప్రాయ పడ్డాడు.

దుబాయ్‌లో ఛాంపియన్ ట్రోఫీ జరిగితే భారత జట్టు తప్పకుండా పాల్గొంటుందని దినేష్ కార్తీక్ తెలిపాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలని సెలక్షన్ కమిటీకి సూచించాడు. వరుణ్‌ను తీసుకోకపోతే ఘోర తప్పిదం అవుతుందన్నారు. పాకిస్థాన్ వేధికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే అక్కడ ఆడేది లేదని బిసిసిఐ పేర్కొంది. ఇదే విషయాన్ని ఐసిసికి పిసిబి కూడా సమాచారం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు జరుగనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News