- Advertisement -
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన హంతకుడు నాథూరాం గాడ్సేను కీర్తిస్తున్న వారిపై బిజెపి ఎంపి వరుణ్ గాంధీ మండిపడ్డారు. వారి ప్రవర్తనను బాధ్యతారహితంగా పేర్కొంటూ దేశం సిగ్గుపడేలా చేస్తున్నారంటూ వరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం ఎప్పుడూ ఆధ్మాత్మికంగా మహాశక్తివంతమైనదని, మహాత్మా గాంధీ దేశ ప్రజలలో స్ఫూర్తిని రగల్చడమేగాక మనలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించారని, గాడ్సే జిందాబాద్ అంటూ ట్వీట్ చేస్తున్న వారు బాధ్యతారహితంగా దేశం సిగ్గుపడేలా చేస్తున్నారని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కొందరు మితవాదులు నాథూరాం గాడ్సే జిందాబాద్ అంటూ ట్వీట్లు ట్రెండ్ చేయడాన్ని పురస్కరించుకుని వరుణ్ గాంధీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
- Advertisement -