Thursday, January 23, 2025

ఎమోషనల్ ‘ది కానిస్టేబుల్’గా వరుణ్ సందేశ్

- Advertisement -
- Advertisement -

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న “ది కానిస్టేబుల్” చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లో జరిగాయి. బి.నిఖిత జగదీష్ కెమెరా ఆన్ చేయగా, బి జే రిథిక క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ…. ఈ తరహా చిత్రం తను మునుపెన్నడూ చేయలేదని, ఒక ఎమోషనల్ కానిస్టేబుల్ పాత్రలో ఇందులో నటిస్తున్నానని దర్శకుడు చెప్పిన కథ.

కథనం తననెంతగానో ఆకట్టుకున్నాయనీ, ఈ చిత్రంలో నటిస్తుండటం తనకెంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా, జూన్ 5 వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు, మిగతా నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు నిర్మాత బలగం జగదీష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News