- Advertisement -
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్… మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ ‘విటి 15’తో సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ కాబోతోంది. ఈ చిత్రం హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ రితిక నాయక్‌తో పాటు టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ యూనిక్ సినిమాటిక్ అడ్వంచర్‌ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు. ఈ సినిమా ఎమోషన్స్, థ్రిల్స్ రోలర్ -కోస్టర్ రైడ్‌గా ఉండబోతోంది.
- Advertisement -