Wednesday, January 22, 2025

సామాజిక బాధ్యతను గుర్తు చేసే సినిమా

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను స్టైలిష్ ఫిల్మ్‌మేకర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను శుక్రవారం విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు వరుణ్ తేజ్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

మెయిన్ పాయింట్, ఎమోషన్స్ నచ్చాయి…
దర్శకుడు ప్రవీణ్ చెప్పిన కథలోని మెయిన్ పాయింట్, ఎమోషన్స్ నచ్చాయి. కథ విన్న తర్వాత స్టైలిష్ యాక్షన్ మూవీస్‌లో సాధారణంగా యాక్షన్, స్టైలిష్ అంశాల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కంటెంట్ తక్కువగా ఉంటుంది. కానీ ప్రవీణ్ కథ చెప్పినప్పుడు తను మాట్లాడాలనుకున్న ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా పెద్దదని నాకు ఓ యంగ్‌స్టర్ గా తెలుసు.
సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా…
నటుడికి ఓ సామాజిక బాధ్యతాయుతమైన పాత్రల్లో నటించే సినిమాలు తక్కువగానే వస్తుంటాయి. ఎఫ్ 2, ఎఫ్ 3లాగా కామెడీ చేయాల్సి ఉంటుంది. గని విషయానికి వస్తే యాక్షన్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా. అయితే మంచి కథతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఉండే ‘గాండీవధారి అర్జున’లాంటి సినిమా చేయటం నాకు బావుంటుందనిపించింది.

డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్…
ప్రవీణ్‌కి యాక్షన్ ఎలా కావాలనే దానిపై ఓ అవగాహన ఉంది. అందుకనే తన సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సులు బావుంటాయి. గాండీధారి అర్జున మూవీ విషయానికి వచ్చేసరికి ఇందులో ఎక్కువ రోప్ షాట్స్ సీజీ వర్క్ ఉపయోగించకుండానే చేశాం. ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్ చేశాం.
బాడీగార్డ్ రోల్ చేశా…
‘గాండీవధారి అర్జున’ స్పై సినిమా కాదు. ఇందులో నేను బాడీగార్డ్ రోల్ చేశాను. సాధారణంగా మన దేశానికి చెందిన ప్రతినిధులు ఇతర దేశాల్లో చర్చలకు వెళ్లినప్పుడు వాళ్లు అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకుంటారు. ఇలాంటి వాళ్లలో దేశ రక్షణ వ్యవస్థలో పని చేసేవాళ్లే ఎక్కువగా ఉంటారు.
నెక్స్ మూవీస్…
ఇప్పుడు నేను చేస్తున్న మట్కా సినిమాలో నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందులో నా క్యారెక్టర్ లో నాలుగు షేడ్స్ ఉంటాయి. మట్కా అనే ఆట ఎలా ప్రారంభమైందనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News