Sunday, December 22, 2024

ఘనంగా వరుణ్‌తేజ్, లావణ్యల నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో వరుణ్‌తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో ఇరు కుటుంబాల పెద్దలు, స్నేహితులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్ దంపతులు, అల్లు అర్జున్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. వరుణ్, లావణ్యల పెళ్లి ఈ ఏడాది చివరలో జరుగనున్నట్లు తెలిసింది. ఇక వరుణ్‌తేజ్, లావణ్యలు కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. ఈ సమయంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News