Thursday, January 9, 2025

వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో మూవీ..

- Advertisement -
- Advertisement -

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ ఆసక్తికరమైన కొత్త ఎంటర్ టైనర్ కోసం చేతులు కలిపారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది. మేర్లపాక గాంధీ, యువి క్రియేషన్స్ తో వరుణ్ తేజ్ కి ఇది ఫస్ట్ మూవీ. వరుణ్ తేజ్ గతంలో బ్లాక్ బస్టర్ ’కంచె’ కోసం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జతకట్టారు.

ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. యువి క్రియేషన్స్ లో బ్లాక్ బస్టర్ ’ఎక్స్‌ప్రెస్ రాజా’ని అందించిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఇప్పుడు వరుణ్ తేజ్‌తో కలిసి ఒక యూనిక్ సినిమాటిక్ అనుభూతిని అందించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం మార్చి 2025లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ అద్భుతమైన స్క్రిప్ట్ ని రెడీ చేసిన ఈ ప్రాజెక్ట్‌లో వరుణ్ తేజ్ ఫ్రెష్ అండ్ యూనిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News