Sunday, January 19, 2025

‘ఇండో-కొరియన్‌ హారర్‌ కామెడీ ఫిల్మ్‌’గా వరుణ్ తేజ్ కొత్త మూవీ..

- Advertisement -
- Advertisement -

ఇటీవల వరుస ప్లాపులతో నిరాశ పర్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఈ సారి తన పవర్ ఎంటో చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఈక్రమంలో తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.ఆదివారం వరుణ బర్త్ డే సందర్భంగా ఆయన 15వ చిత్రానికి సంబంధించిన ప్రకటనను మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది మూవీపై ఆసక్తి పెంచేలా ఉంది. ‘ఇండో – కొరియన్‌ హారర్‌ కామెడీ ఫిల్మ్‌’గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలిపారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు..‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’,  ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘ఏక్ మినీ కథ’ ఫేం డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News