- Advertisement -
హైదరాబాద్: మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం తేదీ అఫిషీయల్‌గా ప్రకటించారు. ఇరు కుటుంబాల సమక్షంలో జూన్ 9న ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నట్టు సామాజిక మాద్యమాల్లో కార్డు వైరల్ అవుతోంది. మిస్టర్ చిత్రంలో లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నటించాడు. అప్పటి నుంచి ఈ జంట ప్రేమలో మునిగిపోయిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నాగబాబు ఇంట్లోనే నిశ్చితార్థం వేడుకలు జరుగనున్నట్టు సమాచారం. ప్రేమ జంట విదేశాల నుంచి ఇవాళ హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Konidela Lavanya Tripathi ..! @IAmVarunTej weds @Itslavanya pic.twitter.com/BI0F4nZZlG
—
త్రివిక్రమ్ ᶠᵃⁿ
(@Harinani_) June 8, 2023
- Advertisement -