Thursday, January 23, 2025

నవ్వుల పండగలా ‘ఎఫ్ 3’

- Advertisement -
- Advertisement -

“ఎఫ్ 3 సినిమా నవ్వుల పండగలా వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు”అని అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్‌హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఎఫ్ 3’ శుక్రవారం విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని హీరో వరుణ్ తేజ్‌తో ఇంటర్వూ …
సినిమా అంతా నవ్వుతూనే…
‘ఎఫ్ 2’ షూటింగ్ సమయంలోనే ‘ఎఫ్ 3’ చేయాలని నిర్ణయించుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 3 చిత్రం డబ్బు నేపథ్యంలో చేస్తానని అప్పటికప్పుడే రెండు మూడు సీన్లు చెప్పారు. హిలేరియస్‌గా అనిపించాయి. ఇక ‘ఎఫ్ 2’కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ‘ఎఫ్ 3’లో వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు.
హిలేరియస్‌గా వర్కవుట్…
కామెడీ చేయడం కష్టం. ఫన్ డోస్ పెంచడానికి దర్శకుడు అనిల్ నత్తి క్యారెక్టరైజేషన్‌ని డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా వుంటుంది.. అతనికి కనబడదు… వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని ప్రారంభించాం. అది హిలేరియస్‌గా వర్కవుట్ అయింది.పాజిటివ్‌గా వుంటారు…
వెంకటేష్‌తో కళ్యాణ్ బాబాయ్ చేశారు. నేను రెండో సారి కలిసి పని చేయడం లక్కీగా ఫీలవుతున్నా. వెంకటేష్ అంటే నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్‌లా వుంటారు. చిరంజీవితో ఆయనకి వుండే అనుబంధం, ఆయన అనుభవం… ఇలా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. వెంకటేష్ చాలా లైట్ హార్టడ్. చాలా కూల్‌గా వుంటారు. చాలా క్రమశిక్షణగా వుంటారు. ఆయన్ని చూసి సెట్స్‌కి రెండు నిమిషాలు ముందే వెళ్ళేవాడిని. వెంకటేష్ ఎప్పుడూ నవ్వుతూ వుంటారు. పాజిటివ్‌గా వుంటారు.
డబ్బు మీదే లవ్…
ఈ సినిమాలో లవ్ ఉంది. అయితే అమ్మాయి-, అబ్బాయి లవ్ కాదు. డబ్బు మీద వుండే లవ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బుని ప్రేమిస్తారు. తమన్నా, మెహారీన్, సునీల్, అలీ.. అన్నీ పాత్రలు డబ్బునే ఇష్టపడతాయి.
ప్రతి రోజు పండగలా…
‘ఎఫ్ 2’ షూటింగ్‌లో కొంతమంది కొత్త. కానీ ‘ఎఫ్ 3’కి వచ్చేసరికి అంతా ఒక ఫ్యామిలీగా వుండేది. అన్నపూర్ణమ్మ, వై విజయ మా కోసం అప్పుడప్పుడు భోజనం తెచ్చేవాళ్ళు. అందరం బోలెడు కబుర్లు చెప్పుకునే వాళ్ళం. షూటింగ్ ప్రతి రోజు పండగలా వుండేది.
కొత్త కథని చెప్పాం
‘ఎఫ్ 3’ నాకు పూర్తిగా డిఫరెంట్ జోనర్. ‘ఎఫ్ 2’లో తెలంగాణ కుర్రాడిగా చేశా. ‘ఎఫ్ 3’కి వచ్చేసరికి స్పెషల్ గా పాత్రని డిజైన్ చేశారు. నటనకి ఆస్కారం వుండే పాత్ర నాది. కంటెంట్ కూడా చాలా బలంగా వుంటుంది. ‘ఎఫ్ 2’ కథకి కొనసాగింపుగా ‘ఎఫ్ 3’ ఉండదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో ఎలాగైతే పాత్రలు తీసుకొని కొత్త కథలు చెప్పారో ‘ఎఫ్ 3’లో కూడా కేవలం పాత్రలు మాత్రమే తీసుకొని కొత్త కథని చెప్పాం.

Varun Tej Interview about F3 Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News