Sunday, December 22, 2024

15 కోట్లతో వింటేజ్ వైజాగ్ సెట్

- Advertisement -
- Advertisement -

వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ’మట్కా’ ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్. ఈ ఒక్క ఫేజ్‌కే 15 కోట్ల మాసీవ్ బడ్జెట్‌ను కేటాయించారు. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్‌ని రామోజీ ఫిల్మ్ సిటీలో మాసీవ్ సెట్‌లలో రిక్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంతో టీం వర్క్ చేస్తోంది. ’మట్కా’ హై బడ్జెట్ పాన్-ఇండియా చిత్రంగా రూపొందుతోంది. వింటేజ్ సెట్లలో విజువల్ వండర్‌ని అందిస్తోంది. వైజాగ్‌లోని ఎసెన్స్ ప్రతిబింబించేలా రూపొందించిన ఈ సెట్‌లు సినిమా హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తాయి.

వర్సటైల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే వరుణ్ తేజ్ ’మట్కా’లో మరో మరపురాని పాత్రకు జీవం పోయనున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించబోతోంది. దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ మాసీవ్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సెట్స్‌తో పాటు యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని ’మట్కా’ మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News