Sunday, December 29, 2024

వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘మట్కా’. మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ కు ఇది 14వ సినిమా. తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యాక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా మూవీ టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. 1975 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతున్నట్లు పోస్టర్ ను చూస్తే తెలుస్తోంది.

ఇందులో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా, బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రలో నటించనుంది.కాగా, ఈ మూవీని తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News