- Advertisement -
హీరో వరుణ్ తేజ్ ఎల్లప్పుడూ కొత్తగా ఉండే కథలను ఎంచుకోవడం, ప్రయోగాలు చేయడానికి మొగ్గుచూపుతుంటాడు. ఇందులో భాగంగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. దీనికి ఓ ఆసక్తికరమైన టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ పెట్టారట. హీరోయిన్ గా రితికా నాయక్‌ను తీసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం భార్యతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న వరుణ్ తేజ్, తిరిగొచ్చిన వెంటనే ఈ ప్రాజక్టుపై క్లారిటీ వస్తుంది.
- Advertisement -