Sunday, December 22, 2024

బాబాయ్ కి మద్దతుగా అబ్బాయ్.. ఎన్నికల ప్రచారానికి మెగా హీరో

- Advertisement -
- Advertisement -

ఎపిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా హీరో వరుణ్ తేజ్ రంగంలోకి దిగుతున్నాడు. బాబాయ్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన వెల్లడించింది.

వరుణ్‌తేజ్‌ ప్రచారానికి సంబంధించి రోడ్‌షో, సభలు జరిగే ప్రాంతాల వివరాలు వెల్లడించారు. ఈరోజు గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3.30 గంటలకు వరుణ్ తేజ్ రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలిపింది. అనంతరం కొడవలి, చెందుర్తి, దుర్గాడ గ్రామాల్లో నిర్వహించే సభల్లో వరుణ్ పాల్గొంటారిన స్పస్టం చేశారు. కాగా, ఈ సారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News