Sunday, December 22, 2024

జూలై 27న వరుణ్ తేజ్ #VT14 గ్రాండ్ లాంచ్ 

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. కథ, పాత్ర పరంగా ప్రతి ప్రాజెక్ట్ ఒకదానికొకటి భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. వరుణ్ తేజ, కరుణ కుమార్ దర్శకత్వంలో తన 14వ చిత్రానికి సైన్  చేశారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. #VT14 వరుణ్ తేజ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ చిత్రం కానుంది.

‘పలాస’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్, వరుణ్ తేజ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ఈ పాత్ర పోషించడానికి వరుణ్ తేజ్ కంప్లీట్ డిఫరెంట్ గా మేకోవర్‌ అవుతున్నారు. #VT14 చిత్రం 1960 నేపథ్యంలో సాగుతుంది. 60ల నాటి వాతావరణం, అనుభూతి కోసంయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు.  ఈ నెల 27న హైదరాబాద్‌లో #VT14 లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News