Sunday, December 22, 2024

జోరు మీదున్న వరుణ్ తేజ్..

- Advertisement -
- Advertisement -

Varun Tej's 12th Movie Launched in Hyderabad

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’, ‘గని’ సినిమాల షూటింగ్ ను పూర్తి చేసిన వరుణ్ మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. గరుడవేగ ఫేం దర్శకుడు ప్రవీణ్ సత్తారు వరుణ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సోమవారం మేకర్స్ ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మెగా బ్రదర్ నాగబాబు క్లాప్ కొట్టగా.. ఆయన భార్య పద్మజ కెమేరా స్విచ్ ఆన్ చేశారు. యస్ విసిసి బ్యానర్ పై బీవి యస్ యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సమర్పకుడిగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో వరుణ్ నయా లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ 12వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు, నాగార్జునతో ‘ది ఘోస్ట్’ అనే యాక్షన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Varun Tej’s 12th Movie Launched in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News