Wednesday, January 22, 2025

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రం సెప్టెంబర్ 19న ప్రారంభం 

- Advertisement -
- Advertisement -

Varun Tej's 13th film Release on September 19

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకొని, అద్భుతమైన విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తున్న వరుణ్ తేజ్ మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేయనున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ప్రకటన గురించి ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ కొత్త సినిమా స్నీక్ పీక్ వీడియోలో వరుణ్ చాలా క్యురియాసిటీతో స్క్రిప్ట్‌ను చదవడం ఎక్సయిటింగా వుంది. ఈ వీడియోలో కనిపించిన కొటేషన్ హీరో పాత్ర గురించి తెలియజేస్తోంది. స్క్రిప్ట్ చదవడం పూర్తి కాగానే, స్క్రిప్ట్‌  తనకి గొప్ప సంతృప్తిని ఇచ్చినట్లు వరుణ్ తేజ్ ముఖంలో సంతోషకరమైన చిరునవ్వు కనిపించింది.

వీడియో చివర్లో  స్క్రిప్ట్‌పై ఒక బొమ్మ ఎయిర్‌క్రాఫ్ట్‌ని వుంచడం, విమానం టేకాఫ్ అవుతున్నట్లు వినిపించిన సౌండ్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. వీడియో చూపించినట్లు యధార్ధ  సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ కథ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ చాలా విలక్షణంగా వుంది. ఈ మెగా ప్రాజెక్ట్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్, లో తన పాత్ర కోసం వరుణ్ తేజ్ చాలా హోంవర్క్ చేశారని, అన్ని విధాలుగా ఈ పాత్ర కోసం  సిద్ధమయ్యారు అని అనౌన్స్ మెంట్ వీడియో చూస్తే అర్ధమౌతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News