Monday, December 23, 2024

వాసవీ క్లబ్ భవనానికి 500 గజాలు, రూ.25 లక్షల అందిస్తా

- Advertisement -
- Advertisement -
  • ఎం ఎల్ ఏ నన్నపునేని నరేందర్

వరంగల్ కార్పొరేషన్:- వైశ్యులందరు గొప్పగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారని కరోనా, వరదల్లో వైశ్యులు గొప్పగా సేవ చేశారని తూర్పు ఎం ఎల్ ఏ నన్నపునేని నరేందర్ అన్నారు. ఆర్యవైశ్య మిత్రబృందం ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం మహేశ్వరీ గార్డెన్ లో ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో ఆర్యవైశ్య మిత్రబృందం ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా దుబ్బ శ్రీనివాస్, కార్యదర్శి గార్లపాటి నాగేంద్ర బాబు, కోశాధికారి దొడ్డ మోహన్ రావు, 250మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన కార్యవర్గానికి ఎమ్మెల్యే నన్నపునేని శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ, కరోనా వరదలు ఆర్య వైశ్య బృందం ముందుడి సేవ కార్యక్రమాలు చేసింది. మానవ సేవే మాధవ సేవ అని పని చేసే వాళ్లు ఆర్య వైశ్యలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గందే కల్పన నవీన్, పోకల చందర్, ఆర్టీఏ మెంబెర్ గోరంట్ల మనోహర్, బిఆర్‌ఎస్ నాయకులు దాచపల్లె సీతారాం, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News