Sunday, December 22, 2024

వైసిపికి షాక్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా

- Advertisement -
- Advertisement -

వైసిపికి మరో షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు నాయకులు జగన్ కు గుడ్ బై చెబుతూ పార్టీని విడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆ పార్టీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ కూడా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆమె టికెట్ ఆశించారు. జగన్ మాత్రం ఆమెకు టికెట్ ఇవ్వలేదు. దీంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వాసిరెడ్డి పద్మ.. బుధవారం పార్టీకి రాజీనామా చేశారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖను జగన్ కు పంపారు. ఇందులో జగన్‌ విధానాలను తీవ్రంగా విమర్శించారు. గుడ్ బుక్ పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తల కోసం గుడ్ బుక్ కాదు..గుండె బుక్ కావాలన్నారు. జగన్‌వి అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణి, సమాజం పట్ల, పాలనలో, పార్టీని నడపడంలో జగన్ బాధ్యతగాలేరని వాసిరెడ్డి పద్మ విమర్శలు చేశారు. కాగా, వైసీపీ హయాంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News