Wednesday, January 22, 2025

కాసానితో వాసిరెడ్డి రామనాధం ప్రభృతుల భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం బుధవారం హైదరాబాదులోని ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లా రాజకీయాలపై వారు చర్చించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అవలంబించాల్సిన విధానాలపై చర్చించారు. అనంతరం ఇటీవల ప్రమాదంలో గాయపడి హైదరాబాదు యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న టిడిపి వైరా మండల అధ్యక్షుడు చెరుకూరి చలపతిరావును పరామర్శించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మధిర మండల అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు, బోనకల్ మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News