Wednesday, January 22, 2025

పుట్టిన రోజు సందర్భంగా… సిఎం కెసిఆర్ ఆశీస్సులు తీసుకున్న వాసుదేవ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తన జన్మదినం సందర్భంగా దివ్యాంగులు అనుభవిస్తున్న బాధలకు ఇన్నాళ్లు దొరకని సాంత్వన కేసిఆర్ ప్రభుత్వంలో గత తొమ్మిదేళ్లుగా పొందుతున్నామని అదే భావనను ఒక పాటను అక్షర రూపం చేసి స్వరకల్పన చేపించి ముఖ్యమంత్రికి వినిపించారు. ఈ సందర్భంగా వారిని సిఎం కెసిఆర్ అభినందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో దివ్యాంగులపై రూపొందించిన ప్రత్యేక వీడియో సిడిని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంఎల్‌ఎ గంప గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News