Monday, December 23, 2024

తిరుపతిలో పాటల సందడి..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాత. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కశ్మీర పర్దేశీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఇక ‘వినరో భాగ్యము విష్ణు కథ‘ చిత్ర యూనిట్ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సినిమా ఎక్కువ శాతం తిరుపతిలోనే జరిగింది. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను కూడా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఆడియో లాంచ్ ఈవెంట్‌లో పన్నెండు తరాలకు సంబంధించిన తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించడం విశేషం. ఈ సినిమాతో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News