Sunday, December 22, 2024

సంస్థకు గర్వకారణం: ఎండి సజ్జనార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆసియా -పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ టిఎస్ ఆర్టీసి ఉద్యోగులు సత్తా చాటి 2 పతకాలు సాధించడంపై సంస్థ ఎండి విసి సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో మంగళవారం పతకాలు సాధించిన ఎం.అంజలి, కె.కిషన్‌లను ఆయన అభినందించారు. అంతర్జాతీయ క్రీడల్లో రాణించి రెండు పతకాలు సాధించడం సంస్థకు ఎంతో గర్వకారణమన్నారు.

అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు టిఎస్ ఆర్టీసి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు. భవిష్యత్‌లో జరిగే పోటీల్లోనూ పాల్గొని సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన వారికి సూచించారు. నిరంతర కృషి, ప్రాక్టీష్‌తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. తమను సౌత్ కొరియా పంపించి ప్రోత్సహించిన సంస్థ ఎండి విసి సజ్జనార్‌కు ఈ సందర్భంగా ఎం.అంజలి, కె.కిషన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ యాదగిరి, సిపిఎం కృష్ణకాంత్, ఫిజియో హిమన్షు కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News