అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
అధికారులు, ఎన్‌జిఓలతో సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ సమావేశం
హైదరాబాద్: మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జిల్లాల అధికారులు, ఆర్‌డిఓ చేవెళ్ల, డిడబ్లూఓ, మెడికల్, హెల్త్ అధికారులు, లేబర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, డిసిపియూ, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎస్‌ఈఆర్‌పి, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లా అధికారులు, ఎన్‌జిఓలో గురువారం సిపి విసి సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ మాట్లాడుతూ మాన అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్పెషల్ యునిట్‌ను సైబరాబాద్‌లో సెప్టెంబర్05, 2020లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 11 కేసులు నమోదు చేశామని, 54మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని, 23మంది మహిళలు, పిల్లలను కాపాడామని తెలిపారు. బాధితులకు అండగా నిలిచేందుకు సైబరాబాద్ పోలీసులు వివిధ శాఖల అధికారులను సంప్రదిస్తారని తెలిపారు. పెండింగ్ ట్రయల్స్‌ను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారి ఉంటాడని తెలిపారు. మానవ అక్రమ రవాణా శాఖ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ ఎసిపి నరహరిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో షీటీమ్స్ డిసిపి అనసూయ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
VC Sajjanar said human trafficking should be prevented