Thursday, January 23, 2025

విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన ఆర్టీసి ఎండి సజ్జనార్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఎండి, విసి సజ్జనార్ ఆదివారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ఆదివారం ఉదయం పీఠానికి వెళ్లిన ఆయన రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో పీఠాన్ని సందర్శించి అమ్మవారి ఆలయాన్ని సందర్శించానని సజ్జనార్ ఈ సందర్భంగా తెలిపారు.

పీఠాధిపతులతో తనకున్న అనుబంధాన్ని విసి సజ్జనార్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంలో స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందుకున్నానని సజ్జనార్ తెలిపారు. తొలిసారిగా పీఠానికి వచ్చిన సజ్జనార్‌కు స్వరూపానందేంద్ర స్వామి రాజశ్యామల అమ్మవారి ప్రతిమను బహుకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News